రీ సర్వేను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని కృష్ణంపల్లి ఆర్లపడియ గ్రామాల్లో జరుగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను శుక్రవారం జిల్లా ట్రైనీ కలెక్టర్ విద్యాధరిణి పరిశీలించారు. తహశీల్దార్ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న రీ సర్వేను పరిశీలించి చేపట్టే సర్వే నిష్పక్షపాసంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్వేను వేగవంతం చేయాలని సూచనలు చేశామన్నారు. అనంతరం పట్టణంలోని చక్కనగిసి కేంద్రాన్ని సందర్శించి దాసరి పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో దాసరపల్లి గ్రామంలో జరుగుతున్న అమృత్ సర్ ప్రాజెక్ట్ కింద చేపట్టే చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే ఉద్యానవన పంటలకు వచ్చిన నష్టపరిహారం అందజేయడానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆత్మకూరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ నరసింహమూర్తి, తహశీల్దార్ సానా శ్రీనివాసరెడ్డి, ఎపిఒ శ్రీనివాసరావు, మండల సర్వేయర్ రవి పాల్గొన్నారు.










