Oct 28,2023 23:27

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్‌

రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్‌
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులపై, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు, వ్యవసాయ, పశు సంవర్ధకశాఖ, తణ ధాన్యాలను ప్రోత్సహించడం, స్వామిత్వా, రీసర్వే వంటి అంశాలపై జిల్లా కలెక్టర్‌ కె వెంకట రమణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా హౌసింగ్‌ నిర్మాణ పురోగతి లక్ష్యాల మేరకు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రత్యేక శ్రద్ధ వహించి నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి సిఎస్‌ వర్చువల్‌ విధానంలో రెవెన్యూ అంశాలైన రీ సర్వే, జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ, జగనన్నకు చెబుదాం, వ్యవసాయ శాఖ, మిల్లెట్‌ ప్రోత్సాహకం, జగనన్న పాల వెల్లువ, పశు సంవర్దక శాఖ, పంచాయితీరాజ్‌, రూరల్‌ డెవలప్మెంట్‌ కింద ప్రాధాన్యతా భవనాల పురోగతి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, జలజీవన్‌ మిషన్‌ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలతో సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. మల్టీపర్పస్‌ ఫెసిలిటీ గోడౌన్‌ల నిర్మాణాలు ఫేజ్‌ 1 కింద మంజూరైన వాటిలో 20 పూర్తి అయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని, ఫేజ్‌-2 లో 28కి గాను తొట్టంబేడు, కేవిబీ పురంలో రెండు గోడౌన్‌లకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని, ఫేజ్‌ 3 కింద కొత్తగా 39 గోడౌన్‌ల కొరకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ ఆదేశించారు. మిల్లెట్స్‌ని ప్రోత్సహించాలని సూచించారు. గహ నిర్మాణశాఖ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం సంబంధించి తిరుపతి జిల్లా లక్ష్యం మేరకు ఇళ్లు పూర్తి అయిన వాటిలో డ్రైనేజీ, తాగునీటి కనెక్షన్స్‌, విద్యుత్‌ కనెక్షన్‌, మ్యాజిక్‌ సోక్‌ పిట్‌ల ఏర్పాటు, తదితర మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, జగనన్న కాలనీ వెల్కమ్‌ ఆర్చ్‌ ఏర్పాటు ఉండాలని సూచించారు. లేఅవుట్‌ వారీగా రోజువారీ స్టేజి కన్వర్షన్‌ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈసమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌, పథక సంచాలకులు డ్వామా శ్రీనివాసులు, జిల్లా సర్వే అధికారి జయరాజ్‌, జిల్లా గహనిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, డిపీఓ రాజశేఖర్‌, జిల్లా కో ఆపరేటివ్‌ అధికారి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవికుమార్‌ పాల్గొన్నారు.