ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడలో వీఎంసీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డా.రవిచంద్ర ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్నగర్లోని మార్కెట్లలో తనిఖీలు చేయగా.. 5 షాపులలో బయటపడ్డ కుళ్లిన మాంసం వీఎంసీ అధికారులు తెలిపారు. మొత్తం 300 కేజీల కుళ్ళిన మటన్, చికెన్స్వా ధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కుళ్లిపోయిన మాంసం తింటే అనారోగ్యానికి గురవుతారని ఆయన తెలిపారు. కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవిచంద్ర సూచించారు. ఎన్నిసార్లు హెచ్చరించిన మాట వినకపోతే షాపులు సీజ్ చేస్తాం హెచ్చరించారు.










