ప్రజాశక్తి-తిరువూరు: తిరువూరు పట్టణంతో పాటు మండలంలోని పలు రహదారులు ప్రజలకు నరకంగా మారాయి. ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఆర్‌అడ్ బి అధికారుల మొద్దునిద్ర తోడవటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరులో ఆర్‌అండ్‌బి సబ్ డివిజన్ కార్యా లయం పేరుకే ఉంది తప్ప ఐదేళ్ల నుండి డిఇఇ ఉన్నారో లేదో ప్రజా ప్రజా ప్రతి నిధులకు కూడా తెలియని దుస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారిలేక కనీసం మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడంతో గోతులు ఏర్పడి రహదారులు ఛిద్రమయ్యాయి. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లు మరింత అధ్వాన్నంగా తయార య్యాయి. నియోజకవర్గ కేంద్రమైన తిరువూరు పట్టణంలో బోసుబొమ్మ సెంటర్ నుండి బైపాస్ రోడ్డు వరకు అడుగడుగునా గోతులే దర్శనమిస్తు న్నాయి. తిరువూరు నుండి ఊటు కూరు వెళ్లే రహదారిలో వావిలాల, రాజుగూడెం దళితపేట వరకు, రాజు గూడెం మెయిన్ గ్రామం నుండి తెలం గాణ సరిహద్దు పెద్దవరం వరకు, ముష్టి కుంట రహదారి నుండి కొమిరెడ్డిపల్లి మీదగా ఎర్రమడి వరకు, మునకుళ్ల నుండి లింగాల వెళ్లే తెలంగాణా సరి హద్దు వరకు, అక్కపాలెం నుండి చం డ్రుపట్ల వెళ్లే తెలంగాణా సరిహద్దు వర కు, పిటి.కొత్తూరు నుండి చిట్టేల, చౌట పల్లి వరకు, తిరువూరు బైపాస్ రోడ్డు నుండి కోకిలంపాడు వరకు, కోకిలంపా డు(పంచాయతీ రాజ్) నుండి కొత్త కోకి లంపాడు మీదగా పుట్రేల రోడ్డు వరకు, చిట్టెల నుండి గానుగపాడు వరకు రహ దారులన్నీ దినదినగండం నూరేళ్ళ ఆయుషుగా మారాయి. కొన్నిచోట్ల తారురోడ్లు ఆనవాళ్లు లేకుండా మట్టి రోడ్లుగా మారాయి. ఆటోలు, అంబులె న్స్‌లు వెళ్లని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాన రహదారుల నుంచి శివారు గ్రామాలకు బురద మార్గాల్లో నడుచు కుంటూ రాకపోకలు సాగిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.










