Sep 09,2022 22:35

ప్రజాశక్తి-విజయవాడ: రహదారుల ప్యాచ్‌ వర్క్స్‌ను సత్వరమే పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. నగరంలోని పాలిటెక్నిక్‌ కాలేజి ప్రాంతములో ఫుడ్‌ కోర్ట్‌ ఏర్పాటు చేయుటకు నిర్దేశించబడిన సర్వీసు రోడ్‌ను కమిషనర్‌ శుక్రవారం పరిశీలించారు. సదరు రోడ్‌లో గుంటలు ఉండుట గమనించి వెంటనే ప్యాచ్‌ వరకు పనులు చేపట్టాలని సంబందిత ఇంజనీరింగ్‌ శాఖాదికారులను కమిషనర్‌ ఆదేశించినారు.అదే ప్రాంతములో డ్రైన్‌ ల వెంబడి మిషన్‌ ద్వారా శుభ్రపరచాలని డివైడర్‌ స్టోన్స్‌ అక్కడక్కడ పగిలిపోవుట గమనించి వెంటనే వాటి స్థానములో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదురుగా గల గ్రీన్‌ బెల్ట్‌ కు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయవలసినదిగా ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.అనంతరం 3వ డివిజనులో పర్యటిస్తూ గుత్తికొండ ధనుంజయరావు వీధిలో ప్యాచ్‌ వర్కులు నిర్వహించాలని సూచించారు. పంట కాలువ రోడ్‌ లో భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ను పరిశీలించి, ఎమినిటి, ప్లానింగ్‌ , శానిటరీ సెక్రటరీల ద్వారా భూగర్భ డ్రైనేజి కలిసే పాయింట్లను గుర్తించి, శానిటరీ సెక్రెటరిల ద్వారా ఆ పాయింట్లను శుబ్రపరచుటకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర సరిహద్దులలో దూరప్రాంతముల నుండి నగరానికి వచ్చు ప్రజల కొరకు సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగపు అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సర్కిల్‌-3 ఎసిపి జుబెన్‌ రారు వర్మ పాల్గొన్నారు.