రహదారికి భూమిపూజ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
రాయచోటి టౌన్ : రహదారుల ఆభివద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ మిథున్ రెడ్డి, ఎంఎల్‌ఎ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం రూ. 16 కోట్ల నిధులుతో పట్టణంలోని ఠాణా నుంచి సుండుపల్లె మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో రాయచోటి పట్టణా నికి మరింత గుర్తింపు, శోభ కలుగుతుందన్నారు.










