Mar 08,2023 22:12

రహదారిపై ప్రవహిస్తునత్న మురుగునీరు

ప్ర్రజాశక్తి మడకశిర : మడకశిర నగర పంచాయతీలోని కొత్త మసీదు సమీపంలో ప్రధాన రహదారిపై గత కొద్ది రోజుల నుండి మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో అటు పాదాచారులు, ఇటు వాహనదారులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. పాత మసీదు నుండికొత్త మసీదుకు వచ్చే రహదారిలో ఓ కల్వర్టు కింద పూడుకు పోయి నెలల గడుస్తోందన్నారు. మున్సిపల్‌ సిబ్బంది తూతూ మంత్రంగా మున్సిపల్‌ సిబ్బంది చేయించి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. వారం రోజుల నుండి ఈ రహదారిలో మురుగునీరు ప్రధాన రహదారిపై పొంగి ప్రవహిస్తున్నప్పటికీ కనీసం చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. దీంతో మురుగు నీరు రోడ్డుపైకి వస్తున్నాయని అక్కడ నివాసమున్న ప్రజల సైతం అధికారుల తీరు పట్ల విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ రహదారిలో నిత్యం వందలాది మంది ప్రజలు దేవాలయాలకు వెళుతూ ఉంటారు. పాదాచార్యులు కాలినడకతో వెళుతుంటారు .ఇలాంటి ప్రాంతంలో రహదారులను శుభ్రంగా ఉంచవలసి న అవసరం ఎంతైనా ఉంది. మున్సిపల్‌ అధికారులు ప్రజల నుండి ముక్కు పిండి పన్నులు వసూలు చేసుకుంటారు కానీ పారిశుద్ధ్యం కానీ, ప్రధాన రహదారులను శుభ్రం చేయడం కానీ చేయడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అధికారులు పాలకవర్గ సభ్యులు నివాసం ఉన్న కాలనీలో తప్ప పారిశుద్ధ్య పనులు, కాలనీల శుభ్రం చేయడం కానీ ఇతర కాలనీలో చేయడం లేదని పలు కాలనీవాసులు పేర్కొంటున్నారు. అమరాపురం బస్టాండ్‌ నుండి కొత్త మసీదు వరకు వెళ్లే పాత పంచాయతీ కార్యాలయం రహదారి అయితే 15 రోజులకు ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదని విమర్శించారు. కానీ, మురికి కాలువలు తీయడం కాని చేయడం లేదని దీంతో అపరిశుభ్రత మూలంగా దోమల అధికమై తాము ఇళ్లల్లో నివాసం ఉండలేకపోతున్నామని కాలనీలో నివసిస్తున్న ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు నిద్రమత్తు వీడి ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న మురుగునీరు నివారించి రహదారుల శుభ్రం చేయించాలని పాదాచారులు వాహనదారులు కోరుతున్నారు.