Dec 19,2022 22:13

ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-హిందూపురం : కబ్జాకు గురైన హిందూపురం రూరల్‌ మండలం కొటిపి పంచాయతీ వీరంపల్లి రహదారిని పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆ గ్రామస్తులు సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ముందు ఆందోళకు దిగారు. రహదారిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అధికారులు పట్టా ఇచ్చారని విమర్శించారు. అధికారుల స్పందించి ఇచ్చిన పట్టాను రద్దు చేసి గ్రామానికి ప్రధాన రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌ ప్రసాద్‌కు వినతిని ఇచ్చారు. దీనిపై స్పందించిన తహశీల్దార్‌ పరిశీలన చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.