Jan 26,2023 21:35

నందలూరు: జాతీయజెండా ఆవిష్కరిస్తున్నజూనియర్‌ సివిల్‌ జడ్జి .కె.లత


యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జనగణమన గీతం పాడి వందేమాతర గేయం పల్లవించారు. మహ నీయులను మరో సారి గుర్తుచేసుకున్నారు. వారు చూపిన బాటలో నడుస్తామని ప్రతినబూనారు. ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యాలయాలు, విద్యా, స్వచ్ఛంద సంస్థలతో త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. ఆ ప్రాంతంలో సాంస్కృతిక సందడి నెలకొంది. విద్యార్థులు దేశ భక్తి గీతాలను నృత్య ప్రదర్శనలు చేసి అలరించారు. పలు రకాల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
రాజంపేట అర్బన్‌ : పట్టణంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఘ్రనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో వేడుకల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దేశభక్తి నత్యాలు, పిరమిడ్‌ విన్యాసాలు, సైనిక కవాతులు, దశ్యరూపక ప్రద ర్శనలు, చూపరులను ఎంతో ఆకర్షింప చేశాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్‌ కళాశాలకు చెందిన ఎన్‌సిసి క్యాడేట్లు జాతీయ పతాకావిష్కరణ అనంతరం పతాక వందనం చేస్తూ రాజంపేట సబ్‌ కలెక్టర్‌ పర్వాన్‌ఖాన్‌ ప్రతి వందనం స్వీకరిం చారు. కార్యక్రమంలో డిఎస్‌పి శివభాస్కర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, ఎన్‌సిసి ఉన్నతాధికారులు విజయ భాస్కర్‌, చక్రధర్‌, షామీర్‌ అహమ్మద్‌, భానుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందికి, రెవెన్యూ శాఖ సిబ్బందికి, మున్సిపల్‌ సిబ్బందికి విద్యా-వైద్యం, విద్యుత్‌, సచివాలయ ఉద్యోగులకు, డ్వాక్రా మహిళలకు,అటవీ, ఆరోగ్య సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రశంసా పత్రాలనుసబ్‌ కలెక్టర్‌ అందజేశారు. వీరబల్లి : మండలంలో రిపబ్లిక్‌ డే సందర్భంగా గురువారం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఎంపిడిఒ మధుసూదన్‌ రెడ్డి, తహసిల్దార్‌ తులసమ్మ, ఎస్‌ఐ రహీముల్లా, ఎంఆర్‌ సిలో ఎంఇఒ గిరి వరదయ్య, వసతిగృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రంథాలయం, పంచాయతీ కార్యాలయం,అంగన్వాడీకేంద్రాల్లో వద్ద అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఎంపిడిఒ మధుసూదన్‌ రెడ్డి, తాహశీల్దార్‌ తులసమ్మ, సర్పంచ్‌ నాగిరెడ్డి, మాజీ ఎంపిటిసి సుబ్బరామరాజు, ఎంఇఒ గిరి వరదయ్య, పిఒపిఆర్‌డి సురేష్‌బాబు, ఎర్రగడ్డ సుబ్బరంరాజు, లైబ్రరీ రెడ్డి శేఖర్‌, వార్డెన్‌ సుబ్బరాజు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.నందలూరు: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి మేడ విజయభాస్కర్‌ రెడ్డి, ఎంపిడిఒ సౌభాగ్యమ్మ, జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టులో జడ్జి కె.లత, తహసిల్దార్‌ ఉదయ శంకర్‌రాజు, ఎస్‌ఐ మైనుద్దీన్‌,మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొని జెండా వందనం గావించారు. నిమ్మనపల్లి : 74వ గణతంత్ర దినోత్సవాన్ని తాహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ రాంప్రసాద్‌, ఎంపిడిఒ కార్యాలయంలో మండల వైసిపి ఇన్‌ఛార్జ్‌ ఆర్‌ఐ.రమణారెడ్డి, ఎస్‌ఐ ఫాతిమా, ఎంఇఒ రాజగోపాల్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జులేఖ బేగం, ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు, మండలంలోని సచివాలయాలలో స్థానిక సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో భూరీ సర్వే డిటి సిరాజుద్దీన్‌, ఆర్‌ఐ రాంప్రసాద్‌, స్థానిక సర్పంచులు, ఎంపి టిసిలు, సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పీలేరు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాడ వాడలా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. స్థానిక కోర్టు సము దాయంలో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి గాయత్రి, పోలీస్‌ స్టేషన్లో సిఐ మోహన్‌ రెడ్డి, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌ జి.రవి, ఎంపిడిఒ మురళి మోహన్‌రెడ్డి, ఎపిఎస్‌పిడిసిఎల్‌ కార్యాలయంలో ఇఇ సురేష్‌ బాబు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యక్షులు వగలచంద్రారెడ్డి, విశ్రాంత సైనికోద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘ నాయకులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. కలకడ : మండలంలో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం బాటువారిపల్లి సచివాల యంలో ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌, సిఐ నాగేంద్ర, ఎస్‌ఐ తిప్పేస్వామి, తాహశీల్దార్‌ రాము, అన్ని పాఠశాలల, ప్రధానో పాధ్యాయులు జెండా ఆవిష్కరించి వందన సమర్పణ గావిం చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సిహెచ్‌.నారాయణ, ఎంఇఒ మునీంద్ర నాయక్‌, ఎపిఒ చెన్నకేశవులు, ఆఫీస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ స్టాఫ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కలికిరి : మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలికిరి సమీపంలోని సిఆర్‌పిఎఫ్‌, సిఐఎటి స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపల్‌, కమాండెంట్‌ రాజేష్‌ ఐటిబిపి53వ బెటాలియన్‌ కమాండెంట్‌, సైనిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, జెఎన్‌టియు ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, కలికిరి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి, తాహశీల్దార్‌, ఎంపిడిఒ అమర్నాథ్‌ రెడ్డిలు జాతీయ జెండా ఎగువవేసి గౌరవ వందన చేశారు. కలికిరి : విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని మర్రికుంటపల్లి సర్పంచ్‌ రెడ్డిరామ్‌ తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మర్రికుంటపల్లి పంచాయతీ జడ్పి హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల చైర్మన్‌ జయప్రకాష్‌ ఆధ్వర్యంలో జాతీయజెండాను ఎగురవేసి వందనం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్‌ రెడ్డిరామ్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను పాటించి ప్రజాస్వామ్యనికి నిజమైన వారసులు గా నిలవాలని కోరారు. పూర్వపు విద్యార్థి మదన్మోహన్‌ రెడ్డి విద్యార్థులను ప్రోత్సహించడానికి 6 మంది విద్యార్థులకు రూ.12వేలు అందించారు. కార్యక్రమంలో డిఅర్‌పి చాముండేశ్వరయ్య, ఉపాధ్యాయులు విజరు, కుమార్‌, ప్రవీణ్‌, ఆనంద్‌, సరస్వతమ్మ, శైలజ అంగనవాడి టీచర్‌ శాంతమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. రామాపురం :మండలంలో 74వ గణతంత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మోహన్‌ రెడ్డి ఎంపిడిఒ హైదరవల్లితో కలిసి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. తాహశీల్దార్‌ సత్యానంద, ఎస్‌ఐ కొండారెడ్డి, వెలుగు కార్యాలయంలో ఏపిఎం రెడ్డమ్మ, ఉపాధి ఎపిఒ సురేందర్‌ రెడ్డి, పిహెచ్‌సిలో మండల వైద్యాధికారి విజరు కుమార్‌, విద్యాశాఖ కార్యాలయంలో ఎంఇఒ రామకష్ణుడు, 13 గ్రామ సచివాలయంలో గ్రామాల పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరేశారు. పెద్దమండ్యం :మండలంలోని అన్నిప్రభుత్వ , ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో 74వ ఘనంగా గణతంత్ర దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి పూర్ణచంద్రిక రమేష్‌, పెద్దమండ్యం హైస్కూల్లో కమిటీ చెర్మన్‌ టి.ఈశ్వరమ్మ, మోడల్‌స్కూల్లో ప్రిన్సినల్‌ రామంజులనాయక్‌, పోలీసు స్టేషన్‌లో ఎఎన్‌ఐ బాలచందర్‌ నాయుడు, కలిచెర్ల హైస్కూల్లో హెచ్‌ఎం భారతి, తహశీల్దార్‌ కార్యాలయంలో డిటి యల్కంవ్‌, ఎల్లంవారిపల్లి హైస్కూల్‌ లో హెచ్‌ ఎం భాగ్యమ్మ, కోటకాడపల్లి వైసిపి నాయకుడు కేశవ ,పెద్దమండ్యంలోఎంపిటిసి జయరామ్‌, కలిచెర్ల లో కార్యదర్శి ఖాదర్‌ బాషా, వెళిగల్లులో సర్పంచ్‌ సరస్వతి, బండమీదపల్లిలో సర్పంచ్‌ బయ్యరెడ్డి ,పాపేపల్లి లో ఇఒపిఆర్‌ జనార్దన్‌, బండ్రేవు లో సర్పంచ్‌ భారతి, సిద్దవరం లో వైసిపి నాయకుడు సిద్దవరం విశ్వనాథ్‌ రెడ్డి సాయిరాం స్కూల్లో డాక్టర్‌ కార్తికేయ, కె ఎన్‌ ఆర్‌ స్కూల్లో హెచ్‌ఎం అమీన్‌ పీర్‌, ఎన్‌ఒ పల్లి లో సర్పంచ్‌ పద్మావతి తిరుపాల్‌, ఎంఆర్‌సిలో ఎంఇఒ మనోహర్‌, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. సాయి రాం స్కూల్‌ విద్యార్థులు జాతీయ నాయకులు వేషధారణతో వివిధ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీధరావు, ఎపిఎం మధు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.బి.కొత్తకోట : నగర పంచాయతీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యాలయాలు, పాఠశాలలో కళాశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తాహశీల్దార్‌ ధనుంజయులు, ఎస్‌ఐ రామ్మోహన్‌, సిహెచ్‌ ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యులు, ఆసుపత్రి కమిటీ మెంబర్‌ కళ్యాణ్‌ రెడ్డి, నక్కమహేష్‌, తుమ్మరకుంట స్కూల్‌ నందు యంగ్‌ ఇండియా సేవా సమితి సంస్థ, ఒకటోసచివాలయంలో వెల్ఫేర్‌ మౌలా, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ జియా, ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. పుల్లంపేట : మండల పరిధిలోని తహశీల్దార్‌ కార్యాలయం, ఎంపిడిఒ కార్యాలయం, ఎంఇఒ కార్యాలయం, ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ఎంపిపి ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రం నందు జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా ప్రత్యూష హై స్కూల్‌ శాంతినికేతన్‌హైస్కూల్‌. శివపా ర్వతిహైస్కూల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.తంబళ్లపల్లి : మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఇన్‌ఛార్జ్‌ న్యాయమూర్తి హసిఫా సుల్తానా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తహసిల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ కళావతి, ఎంపిడిఒ కార్యాలయంలో మండల అభివద్ధి కమిటీ చైర్మన్‌ నారాయణరెడ్డి, స్త్రీశక్తి భవన్‌ వద్ద ఎంపిడిఒ ఆనంద్‌ కుమార్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రామకష్ణారెడ్డి, వైద్యవిధానపరిషత్‌ ప్రభుత్వఆసుపత్రిలో డాక్టర్‌ పావని త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని పాఠ శాలలు, గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జెండా ఎగురవేసి రిపబ్లిక్‌ డే ప్రాధాన్యతను వివరించారు. గాలివీడు : మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. తాహశీల్దారు కార్యాలయంలో దైవాదినం, ఎంపిడిఒ కార్యాలయంలో వైస్‌ ఎంపిపి మిట్టపల్లి యదుభూషణ్‌రెడ్డి, పోలీస్టేషన్‌లో ఎఎస్‌ఐ రఘురామయ్య, సచివాలయాల వద్ద ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు, సచివాలసిబ్బంది పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలోప్రధానోపాధ్యాయుడు బి.రెడ్డన్న, బాలికలు ఉన్నతపాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఓ.నిర్మల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : పట్టణ లోని శ్రీ చైతన్య పాఠశాలలోఎజిఎం రమణయ్య, ప్రిన్సిపల్‌ ఆకేపాటి సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ అనూష, డీన్‌ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్‌ ఇంచార్జ్‌ శ్రీనివాసులు, ప్రైమరీ ఇంచార్జ్‌ కస్తూరి, ఉపాధ్యాయులు వెంకటేష్‌, వెంకటసుబ్బయ్య, సుప్రియ, మధుప్రియ, నాగలక్ష్మి, ప్రసన్న, రూప, ప్రతిభా భారతి, అనిత, సుజాత, షకీన, శ్రీదేవి, వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్‌, షాబు, మురళీమోహన్‌ రెడ్డి, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.