రెండోరోజూ గడపగడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని కంపసముద్రంలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి నిర్వహించారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందచేశారు. ఒక్కొక్క కుటుంబానికి ఏయే పథకం ద్వారా ఎంతమేర లబ్ధి చేకూరిందో వివరిస్తూ ప్రజల ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అందించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్నారు. వైఎస్‌ఆర్ పింఛన్ కానుక, జగనన్న విద్యాదీవెన, వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ, వైఎస్‌ఆర్ భరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి పేదలందరికీ ఇళ్లు, వైఎస్‌ఆర్ ఆసరా, చేయూత వంటి పథకాలను ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందిస్తున్నారని, ప్రజలంతా ముఖ్యమంత్రికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ అమరారెడ్డి బూదవాడ వైసిపి నాయకులు ప్రతాప్‌రెడ్డి, మల్లవరపు మోహన్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు, మండల అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










