Mar 29,2022 11:03

అమరావతి : మోడీ సర్కార్‌ కార్మిక, కర్షక, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలపై సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమయింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు, సంఘాల సంయుక్త వేదికలు పిలుపునిచ్చిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు తొలిరోజు దేశవ్యాప్తంగా అద్భుతమైన భారీ స్పందన లభించింది. కార్మికలోకం కదం తొక్కింది. పదికోట్ల మందికిపైగా సమ్మెలో పాల్గన్నారు. పలు ప్రాంతాల్లో బంద్‌ వాతావరణం నెలకొంది. ఎల్‌ఐసి బ్యాంకులు సంపూర్ణంగా మూతపడ్డాయి. ఎపి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కార్మికులు తమ విధులను బహిష్కరించి సమ్మెను జయప్రదం చేశారు.

విజయవాడ : విజయవాడ వన్‌టౌన్‌ కాళేశ్వర మార్కెట్‌ వద్ద మానవహారంలో పాల్గొన్న గఫూర్‌, ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ నాయకులు.

011


విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద మానవహారంలో పాల్గొన్న ఉమామహేశ్వరరావు, ఆల్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు.
విజయవాడ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసు వద్ద మానవహారంలో పాల్గొన్న ఉమామహేశ్వరరావు, సుధాకర్‌, ఆల్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు.

03


 

vja

రెండోరోజు సార్వత్రిక సమ్మె మంగళవారం కొనసాగుతోంది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తాడిపత్రిలో రెండోరోజు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పొదిలి లో రెండవ రోజు సార్వత్రిక సమ్మె లో భాగంగా ఎల్‌ఐసి కార్యాలయం వద్ద కార్మికులు మానవహారం చేపట్టారు. విశాఖలోని పరవాడ లంకెలోని పాలెంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశేట్టి సత్యం నారాయణ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది.

రెండో రోజు కొనసాగుతోన్న సార్వత్రిక సమ్మె


 

రెండో రోజు కొనసాగుతోన్న సార్వత్రిక సమ్మె

 

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండోరోజు మంగళవారం మండల కేంద్రమైన ఉండి లో పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు నిరసన చేపట్టారు.

శింగనమల (అనంతపురం) : రెండోరోజు దేశవ్యాప్త సమ్మె శింగనమల మండల కేంద్రంలో భారీ ఎత్తున జరిగింది. అంగన్వాడీ యూనియన్‌, సిఐటియు, రైతు సంఘం నాయకులు సమ్మెలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.

11


 

33

 

 

44
                     రెండవ రోజు సమ్మెలో చిత్తూరు ఉద్యోగ కార్మిక సంఘాల భారీ ర్యాలీ



    కలకడ లో రెండవ రోజు నిర్వహించిన సిఐటియు అనుబంధ సంస్థల ధర్నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్దతు తెలిపారు.

55

 

66
                                                        శ్రీ‌కాకుళం

 

                                 మంగళగిరి మండలం కాజా గ్రామ సచివాలయం వద్ద సార్వత్రిక సమ్మె

55



సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండోరోజు గుంటూరు పోస్టాఫీసు వద్ద సమ్మె శిబిరంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర నాయకులు నరసింహారావు

66



సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండవరోజైన మంగళవారం తాడికొండ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, విఆర్‌ఏలు, పారిశుధ్య కార్మికులు.

77


                   అఖిలపక్ష రాజకీయ పార్టీలు కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైల్వే డిఆర్‌ఎం ఆఫీస్‌ వద్ద ఆందోళన

అఖిలపక్ష రాజకీయ పార్టీలు కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైల్వే డిఆర్‌ఎం ఆఫీస్‌ వద్ద ఆందోళన

 

                             చల్లపల్లి పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న సిఐటియు, కార్మిక సంఘం నేతలు

challapalli



                         కంచికచర్ల చెవిటికల్లు రోడ్డు సెంటర్‌ లో మానవహారం నిర్వహిస్తున్న ఆయా రంగాల కార్మికులు

88


స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని రెండోరోజు మంగళవారం సీతంపేట లో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

77