May 05,2023 21:03

మాట్లాడుతున్న ఐద్వా నాయకులు

మాట్లాడుతున్న ఐద్వా నాయకులు
రెజ్లర్లపై దాడి అమానుషం
నెల్లూరు:దేశ రాజధానిలో గత 13 రోజులు భారతదేశ రెజ్లింగ్‌ సమైక్య అధ్యక్షుడు బ్రిజేష్‌ భూషణ్‌ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లను బుధవారం అర్ధరాత్రి ఢిల్లీ పోలీసులు వారిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదని బేటి బచావో ఇదేనా అని ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్‌ మస్తాన్‌బీ ప్రశ్నించారు. రెజ్లర్లు న్యాయబద్ధంగా దీక్ష చేపడుతుంటే వారికి మద్దతుగా విద్యార్థులు ర్యాలీ చేస్తే వారిపై అమానుషంగా దాడి చేసి కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు తెలిపారు. 13 రోజుల నుంచి నిరసన చేస్తుంటే వారికి మద్దతు తెలపాల్సిన క్రికెటర్లు సినీమా వారందరూ మౌనం వహించడం ఏమాత్రం దేశానికి మంచిది కాదని, రెజ్లర్లకు పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ రషీద్‌ తెలిపారు
. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం రమణ మాట్లాడుతూ పథకాలు తీసుకొచ్చిన వారిని నడిరోడ్డుపై అగౌరవపరచడం మంచిది కాదని సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని, లేనిపక్షంలో రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు దశల వారీగా జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష కార్యదర్శులు సుబ్బమ్మ, పద్మ, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి నరేంద్ర, డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, కండే కోటేశ్వరరావు, ఆవాజ్‌ నగర కార్యదర్శి షేక్‌ రియాజ్‌, జిల్లా కమిటీ సభ్యులు రవూఫ్‌లు పాల్గొన్నారు.