Dec 28,2022 19:42

రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేస్తున్న ఆర్డీఓ మలోల

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : రేషన్‌ పంపిణీలో అవినీతి అక్రమాలను సహించేది లే దని నెల్లూరు డివిజన్‌ ఆర్డీఓ మలోల హెచ్చరించా రు. బుధవారం ఆయన తా సిల్దార్‌ హమీద్‌, సిఎస్డిటి జ గదీష్‌, ఆర్‌ఐ సునీల్‌ లతో కలసి తోటపల్లిగూడూరు మండలం పేడూరు, నరు కూరు గ్రామాల్లోని 19, 2 నంబర్ల రేషన్‌ దుకాణాల ను తనిఖీ చేశారు. ఈ సం దర్బంగా ఆర్‌డిఒ మాట్లాడు తూ డీలర్లు సమయ పాల న పాటించాలని సూచించారు. అనంతరం ఆర్‌డిఒ బియ్యం నిల్వలను స్టాక్‌ రిజిస్టర్‌లని పరిశీలిం చారు. నరు కూరు, పేడూరు విర్వోలు వరిగొండ సురేంద్ర, చలప తి, సంబంధిత దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.