Feb 06,2023 22:02

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలో పలు రేషన్‌ దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారి విష్ణు మాట్లాడుతూ ఎస్‌పి రాజేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం తెల్లవారుజామున ఉదయం 3:30 నుండి మెగా పెట్టి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు వరికుంటపాడులోని షాప్‌ నెంబర్‌ 22 ను తనిఖీ చేశామని తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా షాప్‌ నెంబర్‌ 22లో దాదాపుగా 20 బస్తాలకు పైగా రేషన్‌ బియ్యం తక్కువగా ఉన్నట్లు రికార్డులలో పరంగా తేలిందన్నారు.
తర్వాత తూర్పు బోయమడుగుల గ్రామంలోని షాప్‌ నెంబర్‌ 18ను కూడా ఆకస్మితిగా తనిఖీ చేసినట్లు ఆ షాపులో కూడా దాదాపుగా 3000 కేజీల బియ్యం తక్కువ ఉందని షాపు మొత్తంలో కేవలం రెండు బస్తాలు బియ్యం మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ రెండు షాపులపై కేసును నమోదు చేసి షాపులను చీజ్‌ చేసి కందుకూరు డివిజన్‌ డిప్యూటీ తహశీల్దార్‌కు సరెండర్‌ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు.