Dec 16,2022 21:56

హైకోర్టు ఉత్తర్వుల పత్రాలను అందజేస్తున్న న్యాయవాది, జనసేననాయకులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : రేగాటిపల్లి సొసైటీ భూములలో పేదలకు ఇళ్లస్థలాలను ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జనసేన నాయకులు, న్యాయవాది స్థానిక ఆర్డీవో తిప్పేనాయక్‌కు శుక్రవారం అందజేశారు. ఈసందర్భంగతా జనసేన నాయకులు మాట్లాడుతూ రేగాటిపల్లి సొసైటీ భూములలో రైతులకు అసైన్‌మెంట్‌ పట్టాలు, పరిశ్రమలకు ఇవ్వకూడదని కేవలం పేదలకు ఇళ్ల పట్టాలుఇవ్వాలని సెప్టెంబరు 26న ఆర్డీవోకు వినతిపత్రం అందజేశామన్నారు. అయినప్పటికీ ఇందులో అసైన్‌మెంట్‌ పట్టాలు ఇస్తున్నట్టు తెలిసి నవంబరు 11న హైకోర్టును ఆశ్రయించామన్నారు. దీంతో ఈభూముల్లో పేదలకు మాత్రమే ఇళ్లస్థలాలను ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పోస్టు ద్వారా వచ్చిన హైకోర్టు కాఫీని ఆర్డీవోకు అం దజేశామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సుబ్బారావు, జనసేన నాయకులు రాజారెడ్డి, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.