చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
రెడ్‌క్రాస్ ఉద్యమ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలు
నెల్లూరు: ప్రపంచవ్యాప్తంగా రెడ్‌క్రాస్ ఉద్యమ వ్యవస్థాపకుడు జీన్-హెన్రీ డ్యునాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని రెడ్‌క్రాస్ సంస్థలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ ''మనం చేసే ప్రతి పని హదయం నుండి వస్తుంది'' అనే అంశమును దష్టిలో ఉంచుకుని, రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ ఆదేశాల మేరకు విఆర్‌సి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహము దగ్గర నుంచి రెడ్‌క్రాస్ సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జీన్-హెన్రీ డ్యునాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్రపటమునకు పూల మాలలను వేసి వారి సేవలను కొనియాడరు. రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నందు ఉన్నటువంటి పేషెంట్లకు వారి సహాయకులకు మజ్జిగ ప్యాకెట్లు , అన్నదానం కార్యాక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో, రెడ్ క్రాస్ కోశాధికారి సురేష్ కుమార్ జైన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, యడవల్లి సురేష్, గుణపాటి ప్రసాద్ రెడ్డి, కన్వీనర్లు ఎం.వి.సుబ్బారెడ్డి, టి. భాస్కర్ రెడ్డి, డాక్టర్.వి.వేణు, కొ-కన్వీనర్లు షేక్ పర్వీన్, టి.సురేఖ, ఏ.వి.రమణయ్య, రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి పి.మస్తానయ్య, కాన్సర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్.ఎం.నాగేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. లక్ష్మి, డాక్టర్. గీత ఉషశ్రీ, డాక్టర్.రమేష్ బాబు, డాక్టర్ హరిత రాణి, జనరల్ మేనేజర్ ఎం.డీ.జుబైర్, కన్యాకుమారి, పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు ఎస్‌్ వేణుగోపాల్ రావు, జీవిత కాల సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ,రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.










