May 08,2023 21:16

మెడల్‌ అందజేస్తున్న గవర్నర్‌

మెడల్‌ అందజేస్తున్న గవర్నర్‌
రెడ్‌క్రాస్‌ అత్యుత్తమ సేవలకు గుర్తింపు
-గవర్నర్‌ నుంచి బంగారు పతకం అందుకున్న ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు :రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో జిల్లా నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వ్యక్తిగతంగా రూ. 25 లక్షల రూపాయలు డోనేషన్‌ ను జిల్లా రెడ్‌ క్రాస్‌ కు అందించినందున ఎంఎల్‌సి పర్వత రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి బంగారు పథకాన్ని అందుకున్నారు. సోమవారం వరల్డ్‌ రెడ్‌ క్రాస్‌ డే సందర్భంగా రాజ్‌ భవన్‌ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ నజీర్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించి 26 జిల్లాల్లో రెడ్‌ క్రాస్‌ ద్వారా అత్యుత్తమ సేవలందించిన 11 మందికి గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు.అందులో భాగంగా జిల్లా నుంచి అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం తోపాటు వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు డోనేషన్‌ ను రెడ్‌ క్రాస్‌ కు అందించినందున ఎంఎల్‌సి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి ఈ గౌరవం దక్కింది
. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ చేస్తున్న సేవలను కొనియాడారు.అదే విధంగా రెడ్‌ క్రాస్‌ స్టేట్‌ ఛైర్మెన్‌ శ్రీధర్‌ రెడ్డి, స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ ఏ కే ఫరీడా లు మాట్లాడుతూ రాష్ట్రం లో జిల్లా రెడ్‌ క్రాస్‌ చేస్తున్న సేవలను గురించి గవర్నర్‌కు వివరించారు. దేశంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ అత్యధిక సేవలు నిర్వహిస్తున్నదని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కి తెలియజేశారు.