కలెక్టర్‌కు చెక్ అందజేస్తున్న అధికారులు
పుట్టపర్తి అర్బన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి పెనుకొండ డివిజన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు 50 వేల రూపాయలు విరాళం అందజేశారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ బసంత్ కుమార్‌కు చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెనుకొండ డివిజన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఉద్యోగులు 50 వేలు రూపాయలు అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సమాజానికి అనేక సేవలు అందిస్తోందని చెప్పారు., విరాళంగా చెక్కును అందించిన ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.










