ప్రజాశక్తి-కంచికచర్ల: టిడిపి ఆధ్వర్యంలో శనివారం నిర్వహిస్తున్న రైతుపోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మరిర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నెట్టెం రఘురామ్, తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. పరిటాల గ్రామంలోని టీడీపీ పైలాన్ వద్ద జరిగే రైతు పోరు సభ ప్రాంగణం వద్ద శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రైతుల ఇబ్బందులకు జగన్‌రెడ్డి ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, లక్షాలాది ఎకరాల్లో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని అన్నారు.










