మదనపల్లె అర్బన్ : రైతులు యాజమాన్య పద్దతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించేందుకు వీలవుతుందని మదనపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకు కె.శివశంకర్ అన్నారరు. శనివారం మండలంలోని సిటిఎం గ్రామంలో రైతులకు కలికిరి కషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కేవలం రసాయన పద్ధతులు లేదా సేంద్రియ పద్ధతు లతో వ్యవసాయం చేయడానికైన అందుబాటులో ఉండే అన్ని వనరులను ఉపయోగించి సమగ్రంగా వ్యవసాయం చేస్తే మంచి దిగుబడులతోపాటు రైతుకు ఆదాయం వస్తుందని తెలిపారు. కెవికె శాస్త్రవేత్త ఎస్.సోమశేఖర్ బాబు మాట్లాడుతూ వేరుశెనగ, వరి పంటలలో కలుపు నీటి యాజమాన్య పద్ధతులు సమగ్ర పోషక యాజమాన్యంపై సమగ్రంగా వివరించారు. శాస్త్రవేత్త వై.పీరు సాహెబ్ మాట్లాడుతూ వరి మరియు వేరుశనగ పంటలలో సమగ్ర సస్యరక్షణ గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి నాగ ప్రసాద్ మాట్లాడుతూ భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ప్రతి ఒక్కరు మట్టి నమూనాలు సేకరించి రైతు భరోసా కేంద్రం ద్వారా భూసార పరీక్ష కేంద్రానికి పంపాలన్నారు. ఉద్యాన శాఖ అధికారి ఈశ్వర ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటలలో ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, వి.హెచ్.సుబ్రమణ్యం, రైతులు పాల్గొన్నారు.










