పుల్లంపేట : మండలంలో ఇటీవల రైతులను కొందరు దొంగ దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా మండల పరిధిలోని అనంతంపల్లి గ్రామంలో పోత్తపి శివరాంరెడ్డి, తిప్పన ప్రభాకర్ రెడ్డి, ఇతర కొన్ని గ్రామాలలో పంట పొలాలకు ఉపయోగించే విద్యుత్ మోటార్ వైర్లను కత్తిరించి దొంగతనం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయి ఇబ్బం దులు పడిపోవడానికి తోడు, ఇప్పుడు ఈ దొంగలు మోటార్ వైర్లు దొంగలిస్తూ రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైర్లను కట్ చేయడం, వాటిని కాల్చి అందులో ఉన్న కాపర్ ను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. రాత్రి వేళల్లో పొలాల వద్ద ఎవరు ఉండరని గ్రహించిన ఈ విధమైన దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు దొంగల దెబ్బ మరింతగా ఇబ్బందులు కలుగ చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గట్టి నిఘా పెంచి దొంగదెబ్బ తీసే ఈ వైరు దొంగలకు చేయాలని పలువురు కోరుతున్నారు.










