ప్రజాశక్తి-చెన్నేకొత్తపల్లి పంటలు సాగు చేసి నష్టపోయిన రైతు లను వెంటనే ఆదుకోవాలని మాజీమంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. పరిటాల సునీత చేపట్టిన రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శని వారం మండలంలోని ముష్టికోవెల నుంచి సుబ్బ రాయునిపల్లి, న్యామద్దల గ్రామాల మీదుగా మండల కేంద్రానికి పాదయాత్ర చేపట్టారు. ముందుగా పరిటాల సునీత ముష్టికోవెలకు చేరుకోగానే మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన వివిధ రకాల పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీ పరికరాలను ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఎల్.నారాయణచౌదరి, నెట్టెం వెంకటేశులు, మండల కన్వీనర్ ముత్యాలరెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు దండు ఓబులేసు, రంగయ్య, మాజీ ఎంపిపి అంకె అమరేంద్ర, మాజీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, బెస్త నాగార్జున, ఎస్‌జె.శంకర్, వడ్డే దుర్గ, గేట్ నాగరాజు, ఆంజనేయులు, కాన శివారెడ్డి, గురుప్రసాద్, మేడాపురం వెంకీ, కోళ్ల సూరి, శంకర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి పరిటాల సునీత










