Dec 23,2022 21:32

రైతులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న చిలకం మధుసూదన్‌రెడ్డి

        ముదిగుబ్బ : వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని సిరగారిపల్లి, దేవరగూడపల్లి, శీలోల్లపల్లి గ్రామాల్లో పర్యటించి పోలాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలయ్యారన్నారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. సబ్సిడీ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిలకం వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు గుర్రం జయచంద్ర, మధు, కోన శేఖర్‌, నరేంద్ర, అశోక్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.