May 20,2023 21:27

రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

ప్రజాశక్తి-రామాపురం
రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని బండపల్లెలో వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రైతుల ముంగిటకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. నాణ్యమైన విత్తనాలను, మందులను అందించడం జరుగుతొందన్నారు. అంతేకాక గ్రామాల్లో వ్యవ సాయ అధికారులు, సిబ్బంది అందుబాటులో వుండి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతోపాటు అవసరమైన ఇతర సేవలను అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి మండల కన్వీనర్‌ గడికోట జనార్దన్‌రెడ్డి, జడ్‌పిటిసి మాసన వెంకటరమణ, మాజీ రెస్కో చైర్మన్‌ కష్ణారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కర్ణపు విశ్వనాధరెడ్డి, వైస్‌ ఎంపిపి లు రవిశం కర్‌రెడ్డి, బాబు, సర్పంచ్‌ రవిశంకర్‌ రెడ్డి, మాజీ ఎంపిపి కదిరయ్య, సింగల్‌ విండో అధ్యక్షుడు పెద్దిరెడ్డి, మాజీ ఎంపిటిసి రమణ, సర్పంచ్‌ లు అయో ధ్యాపురం నాగభూషన్‌ రెడ్డి, రామాంజులు, మునీర్‌, ఆంజనేయులు, రఘు, వడ్డెర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆంజనేయులు, నాయకులు జనార్దన్‌రెడ్డి, ఎంపి టిసి చిన్న నరసింహులు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరం వెంకట సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.