రైతులకు సూచనలు చేస్తున్న గీతాకుమారి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :వరిని ఆశిస్తున్న అగ్గి తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి యు. గీతాకుమారి సూచించారు. సోమవారం ఆమె మండలంలో పర్యటించారు. గీతాకుమారి వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తెలుళ్ల నివారణకు సూచనలు చేశారు. రైతులు వరి సాగులో సందేహాలను గీతాకుమారిని అడిగి నివత్తి చేసుకొన్నారు.










