Jun 06,2023 20:13

ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న కావలి ఏడీఏ నాగరాజు

రైతులకు ఈ-క్రాఫ్ట్‌ నమోదు తప్పనిసరి
ప్రజాశక్తి-అల్లూరు : వ్యవసాయ రైతులకు సంబంధించి ఈ-క్రాఫ్ట్‌ నమోదు తప్పనిసరిగా విఎఒలు రిజిస్టర్‌ చేయాలని కావలి ఎడిఎ నాగరాజు తెలియజేశారు. మంగళవారం మండల కేంద్రం స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్లో రైతులు అనేక మెలకువలు పాటించాలని కోరారు.
మెమో పిప్పి, పలు తెగుళ్లకు సంబంధించి అనేక విషయాలు కూలంకుషంగా వెల్లడించారు. ఈక్రాఫ్ట్‌ నమోదు కారణంగా రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. గతంలో తాను సూళ్లూరుపేటలో విధులు నిర్వహించి కావలికి బదిలీ అయినట్లు తెలియజేశారు. రైతులకు సంబంధించి ఎలాంటి సలహాలు సందేహాలు ఉన్నా వెంటనే సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు తదితరులు ఉన్నారు.