Dec 29,2022 21:45

ఇదేం ఖర్మ కార్యక్రమంలో మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తిప్పేస్వామి

              ప్రజాశక్తి-మడకశిర   పరిశ్రమల స్థాపన పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి రైతులకు ఇప్పించేందుకు టిడిపి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆపార్టీ టిడిపి ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. గురువారం మండలంలోని సి.కోడిగేపల్లిలో రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఉండే రైతులు భూములను సెజ్‌ల పేరుతో తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదన్నారు. అలాగే యువతకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపానపోలేదన్నారు. అంతేగాకుండా అప్పట్లో తక్కువ ధరకు తీసుకున్న భూములను ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్మకానికి పెట్టడం బాధాకరమన్నారు. వెంటనే రైతులకు భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇకపోతే పరిపాలనలో జగన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, కల్లుమరి క్లస్టర్‌ ఇన్‌ఛార్జి నాగరాజు, ప్రధాన కార్యదర్శి రంగేగౌడ, నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు తిప్పేస్వామి, టిడిపి సీనియర్‌ నాయకులు నరసింహారెడ్డి, క్రిష్టప్ప, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ సుబ్బారాయుడు, రిటైర్డ్‌ ఇంజినీర్‌ మల్లికార్జున, రామకృష్ణ, సి.కొడిగేపల్లి పంచాయతీ నాయకులు, పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలోని ప్రజలు పండుగలు జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నారని టిడిపి నాయకులు అన్నారు. గురువారం పట్టణంలోని 4వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టిడిపి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ముఖ్యంగా వైసిపి అధికారంలోకి వచ్చాక పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్‌ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పంచారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలు, రంజాన్‌ తోఫాలాంటి పథకాలు ఇచ్చి పండుగను సంతోషంగా జరుపుకోవడానికి దోహదపడ్డారన్నారు జగన్‌ అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ రద్దుచేసి నిరుపేదల కడుపుకొట్టారని ఆరోపించారు. అనేక కారణాలు పెట్టి సంక్షేమ పథకాల్లో కోతలు కోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్కరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని రానున్న రోజుల్లో టిడిపిదే అధికారం అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జి అంబటి సనత్‌, హిందూపురం పార్లమెంట్‌ సోషియల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ తోట వాసుదేవ, టిడిపి నాయకులు గోసల శ్రీరాములు, నబీరసూల్‌, పుటపర్తి ప్రభాకర్‌, జయలక్ష్మీ, లోకేష్‌, నబీరసూల్‌, ఫకృద్దీన్‌, కరెంటు ఆదినారాయణ, ఐటిడిపి నాయకులు చెలిమి శివరాం, కుళాయప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఓబులదేవరచెరువు : తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మిట్టపల్లి పంచాయతీలో ఉన్న మిట్టపల్లి, గాజుకుంట్లపల్లి, మల్లాపల్లి తదితర గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విడతలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం అన్నిరంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు గురువుతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యవంతులుగా చేసి రాబోయే కాలంలో టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ జయచంద్ర, నిజాం, డాక్టర్‌ జాకీర్‌అహ్మద్‌, బడిసం రామాంజనేయులు, షాను, ఆరీఫ్‌ఖాన్‌, సౌదీ నాగరాజు, పీట్ల సుధాకర్‌, నిజాం, అంజినప్ప, గంగాద్రి, చండ్రాయుడు, ఇర్షాద్‌, కంచి సురేష్‌, ఓబుల్‌రెడ్డి, కొండే ఈశ్వరయ్య, జయ చంద్రారెడ్డి, షబ్బీర్‌, చాంద్‌బాషా, అంజన్‌రెడ్డి, శంకర్‌, అబ్బులు, అఖిల, రాజారెడ్డి, ముంతాజ్‌ తదితరులు పాల్గొన్నారు.