Jun 24,2023 19:22

రైతులకు సూచనలు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-ఉలవపాడు :మండలంలోని కరేడు సచివాలయం -3 పరిధిలోని అలగాయపాలెం గ్రామంలో శనివారం మండల వ్యవసాయ అధికారిని బి తిరుమల జ్యోతి ఆధ్వర్యంలో వేరుశనగ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా డిపిడి ఆత్మ జి శ్రీమన్నారాయణ వేరుశనగ పైరును పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. కష్ణ విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ జి శివ జ్యోతి శాస్త్రవేత్త వేత్తలు కే కిరణ్‌ కుమార్‌ రెడ్డి డి విజరు కుమార్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.