రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం
ప్రజాశక్తి-ఆత్మకూర్ అర్బన్ : రైతుల సమస్యలపై పరిష్కారం కోసం ఆదివారం పలు పార్టీల నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 26న అఖిలభారత కిసాన్ సభ పిలుపు మేరకు రైతు సమస్యల పరిష్కారం కోసం ఆత్మకూరు పట్టణంలో ట్రాక్టర్ల ప్రదర్శన జరుగుతుందన్నారు. ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, సకాలంలో ఎరువులు ఇవ్వలేక పోవటం, ధాన్యం కొనుగోలు విషయంలో ఫెయిల్యూర్ తదితర విషయాలను చర్చించేందుకు చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం గ్రామ, పట్టణ, నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసి రైతు సమస్యల కోసం పోరాటం చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం తరపున గంటా లక్ష్మిపతి, కన్వీనర్ కెవి శేషారెడ్డి, తెలుగు రైతు తరపున టిడిపి, చండ్ర వెంకట సుబ్బానాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగు మహిళా నాయకురాలు పులిమి శైలజ, సిఐటియు తరపున ఆత్మకూరు నాగయ్య, ఎపి రైతు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్కు ప్రసాద్, కృష్ణమోహన్ చర్లో సుబ్బరామిరెడ్డి, చిల్లకూరు రమణారెడ్డి, పి.వెంకటరామిరెడ్డి, ఒంటేరు మల్లికార్జున, బాపనపల్లి రమణయ్య, వాగాల పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.










