Oct 09,2022 22:15

ప్రజాశక్తి-మైలవరం :

అమరావతి రైతుల పాదయాత్ర పై వైసీపీ విష ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వైసిపి నాయకులు ఉన్నారని, విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి కొన్న భూములు వివరాలు చెప్పాలని ప్రశ్నించారు. ఇసుక, మద్యం, రేషన్‌ బియ్యం ద్వారా దోచుకున్న దాంట్లో వాటా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి హైదరాబాద్‌ అక్కడ నుండి లండన్‌కు తరలుతుందన్నారు. దోచుకుని దాచుకోవడం తప్ప రాష్ట్రంలో అభివద్ధి శూన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.