May 05,2023 21:34

ఫొటో : మాట్లాడుతున్న తెలుగు గంగ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సువర్ణమ్మ

రైతుల భూముల్లో డిప్యూటీ కలెక్టర్‌
ప్రజాశక్తి-మర్రిపాడు : ఆనం సంజీవరెడ్డి సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ మూడవ రీచ్‌లో రైతులు కోల్పోతున్న భూములను తెలుగు గంగ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సువర్ణమ్మ శుక్రవారం పరిశీలించారు. రెండేళ్లలో భూములు కల్గిన రైతులు ఎవరైనా మృతి చెందిన ఎడలా కుటుంబంలోని భార్య లేదా వారసులకు భూపరిహారం అందుతుందని పేర్కొన్నారు.
కొందరు రైతులు తహశీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ అడంగల్‌లో తమ భూములు తమ పేరు మీద ఉన్నాయని, తెలుగు గంగ కార్యాలయంలో ఒకరి భూములు మరొకరి పేరుతో ఉన్నాయని డిప్యూటీ కలెక్టర్‌ను అడుగగా ఎవరు మారుస్తారంటూ ఆమె రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భూములకు సంబంధించిన ధ్రువపత్రాలను రైతుల వద్ద నుండి స్వీకరించారు. కార్యక్రమంలో తెలుగుగంగ కార్యాలయ సిబ్బంది, విఆర్‌ఒ రైతులు ఉన్నారు.