Nov 07,2023 21:28

మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో వరుసగా ఐదవ ఏడాది రెండవ విడతగా వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం కింద అర్హులైన 2,94,234 మంది రైతులకు రూ.120.17 కోట్ల లబ్ధి చేకూరినట్లు కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా స్థాయి రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.గౌతమి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, ఎల్డీఎం సత్యరాజ్‌, రేకులకుంట ఎఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త సహదేవ రెడ్డి, హార్టికల్చర్‌ డిడి రఘునాథరెడ్డి పాల్గొన్నారు. అనంతరం రైతుభరోసా కేంద్రం మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిరికల్చర్‌ ఆఫీసర్‌ ఆంజనేయులు, ఫిషరీస్‌ డిడి శాంతి, మార్కెటింగ్‌ ఏడీ చౌదరి, కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ మల్లేశ్వరి, మార్కెఫెడ్‌ డిఎం పెన్నేశ్వరి పాల్గొన్నారు.