Jun 16,2023 21:38

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం- జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి

రాయచోటి : రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పధకాలను ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారన్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు అడిగిన వెంటనే ఇస్తున్నామన్నారు. ట్రాన్స్‌ఫార్మ్‌లు మరమ్మతులు అయితే వెంటనే ఇస్తున్నామన్నారు. ప్రకతి వైపరిత్యాల వల్ల జరిగే నష్ట పరిహారం కోసం అధికారులతో ఎప్పటికప్పుడు సర్వే చేయించి రైతులకు ప్రభుత్వం తరపునుంచి సకాలంలో నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రైతులు ఎక్కువగా ఉద్యాన పంటలు సాగు చేస్తారు. వ్యాల్యు యాడడ్‌ ప్రాజెక్ట్స్‌ ఏ విధంగా తీసుకొని రావాలి అనే దాని పైన అలోచించి వ్యాల్యు యాడెడ్‌ ప్రాజెక్ట్స్‌ తీసుకొచ్చి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. మామిడి, అరటి, బొప్పాయి, తదితర ఉద్యాన పంటలు గాలులు వీచినప్పుడు, పంట నష్టపరిహారం చెందినప్పుడు, వాటికి ధరలు లేక, పంట దిగుబడి ఎక్కువైనప్పుడు, ధరలు లేనప్పుడు, వ్యాల్యు యాడెడ్‌ ప్రాజెక్ట్స్‌ తీసుకొచ్చి జిల్లా రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్‌హెచ్‌జి గ్రూపులు, రైతులు సంయుక్తంగా మామిడి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు మేలు జరిగేలా ట్రాక్టర్లు, యంత్రపరికరాలు పంపిణీ చేశామన్నారు. ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఎస్‌ఇ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పరిధిని మించి విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. గతంలో ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. నేడు దరఖాస్తు చేసుకున్న వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌లు ఇస్తున్నామన్నారు. 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందించేందుకు జిల్లాలో 36 సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. రాయచోటిలో 11, రాజంపేటలో 8, కోడూరులో 7, మదనపల్లిలో 2, తంబళ్లపల్లిలో 6, పిలేరులో 2 సబ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ మండలి సభ్యులు బోదాషావలి పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న పంజం సుకుమార్‌రెడ్డి