రాయచోటి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ యాం త్రీకరణ వ్యవసాయ సేవలతో రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళా-2 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరీష మాట్లాడుతూ నేడు వ్యవసాయ సాగు రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పోటీ తత్వం పెరుగుతోందని, వీటిని అందిప్చుకుని వ్యవసాయంలో రైతులు లాభాల బాట పట్టేలా ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 161 సిహెచ్‌సి గ్రూపులకు రూ. 11.385 కోట్ల ఖర్చుతో రూ.3.836 కోట్ల రాయితీపై 100 ట్రాక్టర్లు, 370 వ్యవసాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు ఆర్‌బి.కెల పరిధిలో 10, 15 మంది రైతులతో గ్రూపులు ఏర్పాటు చేసి యంత్ర సేవా కేంద్రాలను నిర్వహి స్తున్నామని చెప్పారు. రైతులు ఒక బాధ్యతగా వ్యవసాయంపై శ్రద్ధ పెట్టి ప్రభు త్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని పేర్కొ న్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మనది రైతు పక్షపాత ప్రభుత్వమని ,రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను జగనన్న ప్రభుత్వం అమలు చేస్తోందిన్నారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీలు దొరికే పరిస్థితి లేదన్నారు. రైతు యంత్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. వీటన్నింటినీ దష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి యంత్ర సేవా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. డ్రిప్పు, చాప్ కట్టర్లు, హార్వెస్టింగ్ యంత్రాలు తదితరాలను రాయితీతో ప్రభుత్వం అందిస్తోందిన్నారు. ప్రభుత్వం రైతన్నలకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు, ప్రజల కోసం అనునిత్యం కషిచేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షం బురద జల్లుడం సమంజసం కాదన్నారు. ఇతరుల మ్యానిఫెస్టో లును కాపీ చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అనంతరం పథకంలో భాగంగా జిల్లాలోని 161 సిహెచ్‌సి గ్రూపులకు సంబంధించి రూ.11.385 కోట్ల ఖర్చుతో 100 ట్రాక్టర్లు, 370 వ్యవసాయ పరికరాలను లబ్ధిదారులకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అలాగే ప్రభుత్వం మంజూరు చేసిన రాయితీ రూ 3.836 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు ముఖ్య అతిథులు అందజేశారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె ఎంపిపి సుదర్సన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఎడిఎ లక్ష్మి సువర్ణ, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రై










