Jan 05,2023 22:20

క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, నాయకులు

ప్రజాశక్తి - తనకల్లు : రైతు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన వ్యవసాయ మాసపత్రిక మన రైతు వాణి 2023 క్యాలెండర్‌ను కదిరి శాసనసభ్యులు డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బడా సుబ్బిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వివి రమణ, జిల్లా కమిటీ సభ్యులు శివన్న, ఎస్‌వి రమణ, నరసింహారెడ్డి ఎ. ఆంజనేయులు బి. రమేష్‌, వి. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.