May 06,2022 16:54

ప్రజాశక్తి-నందిగామ : ఎపి రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గా పివి ఆంజనేయులు, అధ్యక్షుడు గా మద్దిరెడ్డి వెంకటరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా మహాసభలో  పలు తీర్మానాలు చేశారు. నల్లతామర‌ వైరస్ సోకి పంట దెబ్బ తిని కల్తీవిత్తనాలు వల్ల నష్టపోయిన మిర్చి రైతులకు క్రాఫ్ ఇన్సూరెన్స్ చేసి ఎకరానికి లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని, సుబాబులు పంట టన్నుకు 5 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని, చింతలపూడి ఎత్తి పోతల పథకానికి నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని, వేదాద్రి-కంచల ఎత్తి పోతల పథకాన్ని మరమ్మతులు చేపట్టాలని, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు చెల్లించాలని, నల్లతామర‌ పురుగు వైరస్ వల్ల నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగించే నిర్ణయం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని , కౌలు రైతులకు ఎటువంటి నిబంధనలు లేకుండా కౌలు కార్డులు మంజూరు చేయాలని, ఆర్బికెల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు రైతులకు అందించాలని‌ ,పంటలకు కనీస గిట్టుబాటు ధరల చట్టం చేయాలని తీర్మానం చేశారు.