May 03,2023 21:21

ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న జెడి సుధాకర్‌ రాజు

రైతు భరోసా కేంద్రాల్లో తనిఖీలు
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని నార్త్‌ ఆములూరు, పురిణి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాలను బుధవారం జిల్లా అగ్రికల్చర్‌ జెడి సుధాకర్‌ రాజు పలు రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కిసాన్‌కి అర్హులైన రైతులందరూ ఈ కెవైసి తప్పనిసరిగా చేసుకోవాలని తెలియజేశారు.
మే చివరన, కాకపోతే జూన్‌ మొదటి వారంలో 14వ విడత రైతులకు పిఎం కిసాన్‌ పథకం ద్వారా నగదు జమవుతుందని తెలిపారు. రైతులకు సంబంధించిన భూమి ఆధార్‌తో లింకు అలాగే బ్యాంకులకు అనుసంధానం కావాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణుగోపాలరావు, తదితరులున్నారు.