రాయచోటి టౌన్ : రైతులు, కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉండేలా వైఎస్‌ఆర్ రైతు బజార్‌ను అభివద్ధి చేస్తామని, దళారీ వ్యవస్థకు చెక్ పెట్టినట్లవుతుందని ఎంఎల్‌ఎ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికల హైస్కూల్ సమీపంలో రూ 1 కోటి నిధులుతో నిర్మించిన వైఎస్‌ఆర్ రైతు బజార్‌ను పునః ప్రారంభించారు. రైతుల అంగళ్లును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, వినియోగదారుల మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వం వైఎస్‌ఆర్ రైతు బజార్ లను ఏర్పాటు చేసిందన్నారు. ఈ క్రమంలోనే ఆరు నెలల కిందట రాయచోటిలో వైఎస్‌ఆర్ రైతు బజార్‌ను ప్రారంభించామని చెప్పారు. నియోజక వర్గపరిధిలోని అర్హత కలిగి కూరగాయలు, పంటలు పండించుకుని కమీషన్లు లేకుండా , విక్రయించుకునే రైతులకు రైతు బజార్ మంచి వ్యాపార కేంద్రంగా మారనుందని తెలిపారు. కొనుగోలు దారులకు కూడా రైతులు పండించి విక్రయించే తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. మొదటి రోజు పెద్దఎత్తున కొనుగోలుదారులు వచ్చేలా మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు చేసిన కషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, మదనపల్లె నియోజక వర్గ పరిశీలకులు హాబీ బుల్లాఖాన్, వైస్ చైర్మన్ తబ్రేజ్, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు దిన్నెపాడు రవిరాజు, లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధరెడ్డి, చెన్నూరు అన్వర్ బాష, రామాపురం జడ్‌పిటిసి మాసన వెంకట రమణ, వైస్ ఎంపిపి రవిశంకర్ రెడ్డి, జాకీర్,జిన్నా షరీఫ్, సుగవాసి శ్యామ్,ఫయాజ్ అహమ్మద్, పల్లా రమేష్, జయన్న నాయక్,రియాజ్, షిరిడీసాయి కళాశాల డైరెక్టర్ మనోజ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.










