రాయచోటి : ఒడిషా రాష్ట్రంలో బాలాసుర్ జిల్లాకు సమీపంలో హౌరా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (12841), బెంగళూర్-హౌరా ఎక్స్ప్రెస్ (12864) రైలు ప్రమాద దుర్ఘటన జరగడం చాలా బాధా కరమని ఈ ఘటనపై జిల్లాకు సంబంధించి ఏదేని సమాచారం అందజేయడానికి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ గిరీష తెలిపారు. శనివారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ విసి హాల్‌లో విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒడిశాల్లో రైలు ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని, రైలు ప్రమాదంలో చాలా మందికి గాయాలయ్యాయని, చాలామంది మతి చెందడం చెందారని చెప్పారు. రాష్ట్ర ముఖ్య మంత్రి అన్ని జిల్లాల కలెక్టరేట్లకు ఈ దుర్ఘటనపై సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. అన్నమయ్య జిల్లా నుంచి ఎవ రైనా ఈ ప్రమాదంలో ఉంటే తక్షణమే కుటుంబ సభ్యులు సంప్రదించాలన్నారు. అలాగే వారికి కావా ల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారన్నారు. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలోని ఆర్‌డిఒలు, తహశీల్దార్లు, అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు తరచూ మాట్లాడుతూ ఉన్నామన్నారు. ఎవరైనా జిల్లా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రైల్వే శాఖతో కూడా సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడూ సమాచారాన్ని తెలుసుకుంటున్నామన్నారు. జిల్లాల ఎవరైనా ట్రైన్లో ప్రయాణం చేసి ఉంటే ఎటువంటి సమాచారం ఉన్న సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. 08561-293006లో సంప్రదిస్తే అధికార యంత్రాంగం సహాయంగా ఉంటారన్నారు. ఒడిశాలో అక్కడ అధికారులతో మాట్లాడి అన్ని సహాయక చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పర్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.










