ప్రజాశక్తి-చిలమత్తూరు మండలంలోని రాయల చెరువును వెంటనే శుభ్రం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రాయల చెరువులో దాదాపు 2వేలకుపైగా చేపలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో సిపిఎం బృందం గురువారం చెరువును పరిశీలించింది. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కలుషితం వల్లే చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయన్నారు. చేపలు మృతిచెందడంతో దుర్వాసన వెదజల్లుతూ మరింత కలుషితం అయిందన్నారు. ఈ నీటిని తాగిన పశువులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నాయన్నారు. అలాగే అధికారులు స్పందించి చేపలు ఎందుకు చనిపోయాయో కారణాలను కనుగొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఫిరంగి ప్రవీణ్‌కుమార్, మండల నాయకులు లక్ష్మీనారాయణ, రామచంద్ర, శనగనపల్లి గోవింద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చెరువును పరిశీలిస్తున్న చేస్తున్న సిపిఎం నాయకులు










