Jan 30,2022 08:43
  • బెంబేలెత్తిపోతున్న ట్రెజరీ ఉద్యోగులు
  • పిఆర్‌సి అమలు జీతాలు సరిచేయడం మూడు నెలల ప్రక్రియ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బిల్లులు వేయకపోతే చర్యలు తీసుకోవా లని ఆర్థికశాఖ అధికారులు సర్క్యులర్‌ ఇవ్వడం పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బిల్లులు వేయలేదని అధికారులపై చర్యలు తీసుకుంటే అప్పటి నుంచే సమ్మె మొదలుపెడ తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. అయినా ఆర్థికశాఖ మాత్రం మొండిగా ముందుకెళ్తోంది. బిల్లులు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. వాస్తవంగా పిఆర్‌సి సవరించిన తరువాత బిల్లులు వేయడం అనేది రెండు రోజల్లోనో వారంలోనే అయ్యే ప్రక్రియ కాదని, కనీసం రెండు నుంచి మూడు నెలలపై నే పడుతుందని ట్రెజరీ అధికారులు చెబుతు న్నారు. ఒకసారి పిఆర్‌సి ప్రకటించిన తరువాత దాని ఆధారంగా ట్రెజరీ అధికారులకు ఉన్నతా ధికారులు ప్రొసీడింగ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా సర్వీసు రిజిస్టర్‌ను పరిశీలించి దాని ఆధారంగా బేసిక్‌ ఇతర అంశాలన్నీ సరిచేయాల్సి ఉంటుంది. డిపార్టుమెంట్ల వారీగా పరిశీలిస్తే కొన్ని డిపార్టుమెంట్లలో 100 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. కొన్నిట్లో మూడువేల మంది వరకూ ఉంటారు. ప్రస్తుత పిఆర్‌సిలో 81 స్టేజీలు ఉంటే కొత్త పిఆర్‌సిలో వాటిని 83 స్టేజీలకు తీసుకెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ డిఎ కలిపితే ఆ ఉద్యోగిని ఏ బేసిక్‌ స్టేజీలో ఉంచాలో అంచనా వేశారు. దీని కోసం ఉద్యోగి సర్వీసు రిజిస్టర్‌ను పరిశీలిం చాలి. నూతన పిఆర్‌సిని 1.7.2018 నుంచి అమలు చేయాల్సి ఉంది. అప్పటి నుండి 31.3.2020 వరకూ నోషన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే ఇంక్రిమెంట్లు ఇతర బెనిఫిట్లు అమలవుతున్నట్లు రికార్డుల్లో చూపిస్తు న్నా ఉద్యోగులకు అవి అందవు. 1.4.2020 నుండి మానిటరీ బెనిఫిట్స్‌ ఇచ్చారు. అంటే దీనిలో అప్పటి వరకూ బకాయిలు డబ్బు రూపంలో తిరిగి ఇచ్చేయొచ్చు లేదా ఎడ్జస్ట్‌ మెంట్‌ చేయొచ్చు. ఇవన్నీ సరిచేయాలంటే 2018 నుండి ఉద్యోగి సర్వీసు రిజిస్టర్‌ తీసుకుని ఇంక్రిమెంట్లు ఎక్కడ కలిశాయి, ఎంత కలిశా యి. ప్రస్తుతం శాలరీ ఇవ్వాలి అనుకుంటే ఏ బేసిక్‌ స్టేజిలో ఉద్యోగిని కలపాలనే అంశాలన్నీ రికార్డుల ప్రకారం సరిచేసుకుంటూ రావాలి. దీనికి సంబంధించి 1.4.2020 నుండి 31.12.2021 వరకూ లెక్కలు చూడాల్సి ఉం టుంది. 1.1.2022 నుండి క్యాష్‌ పీరియడ్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ రావాలంటే 1.7.2018 నాటికి ఉద్యోగి బేసిక్‌ ఎంత. 2019 నాటికి ఎక్కడ ఫిక్స్‌ చేశారు? వంటివి ప్రతి సంవత్సరం చూసుకుం టూ రావాలి. దీనికి రెండు నుండి మూడు నెలల కాలం పడుతుందని ఉద్యోగులు చెబుతు న్నారు. దీంతోపాటు ఐఆర్‌ 27 శాతం ఇచ్చి ప్రస్తుత పిఆర్‌సిని 23 శాతమే ఇచ్చారు. అంటే నాలుగు శాతం బకాయిలను ఉద్యోగుల నుండి ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది. ఈ మొత్తం ఎంతుంటుంది అనేది కూడా లెక్కలు వేయాల్సి ఉంటుంది. ఇంత ప్రక్రియ చేయాల్సి ఉండగా ప్రస్తుత అధికారులు ఉన్న పాత వివరాల ఆధారంగా జీతాలు వేయాలని కోరు తున్నారు. దీనివల్ల ప్రభుత్వ అనుకూలంగా ఉండే ఉద్యోగు లకు వారికిష్టం వచ్చిన చోట ఇంక్రిమెంట్లు, బెనిఫిట్లు కల్పించుకుని, వారికి కావాల్సిన బేసిక్‌ స్టేజీలో కూర్చుపెట్టుకునే అవకాశముందని ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేశారు.