Jan 31,2023 21:55

ప్రశంసా పత్రాలను చూపుతున్న విద్యార్థినులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : తిరుపతిలో ఈ నెల 28 నుండి 30 వరుకు స్కూల్‌ గేమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన అండర్‌ - 19 రాష్ట్రాస్థాయి పుట్‌బాల్‌ పోటీల్లో చిలమత్తూరు విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీంలో పాల్గొన్న జి. విద్యాశ్రీ 4 గోల్స్‌ వేసి మొదటి స్థానంలో నిలవగా, కడపలో జరిగిన పుట్‌ బాల్‌ పోటీలలో కెఎస్‌ సానియా అండర్‌ 17 విభాగంలో ఆడీ 3 స్థానంలో నిలిచిందని మండల ఆర్డీటీ కోచ్‌, గో గ్రీన్‌ నిర్వహకుడు బాలాజీ తెలిపారు. ఈ సందర్బంగా ప్రతిభా విద్యార్థినులను పుట్‌బాల్‌ అసోషియేషన్‌ సభ్యులు పీడీ లోకేశ్వరి, వెంకటేశులు, రాంమూర్తి, సనావుల్లా, విజరు కుమార్‌, రంగారెడ్డి తదితరులు అభినందించారు.