Nov 30,2022 21:43

ప్రతిభా విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

కొత్తచెరువు : రెండు రోజులపాటు నిర్వహించిన 30వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనపర్చిన ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి. జిల్లా సైన్స్‌ అధ్యక్షులు ఆనంద భాస్కర్‌ తెలిపారు. రెండు రోజులపాటు కొత్తచెరువు లోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలకు జిల్లాలోనే 32 మండలాల నుండి 122 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏడుగురు విద్యార్థులు నెల్లూరు జిల్లా గూడూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. పరిగి మండలం ధనాపురం ఉన్నత పాఠశాలకు చెందిన స్వాతి, గోరంట్ల యూకే ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలకు చెందిన ధీరజ్‌, పెనుగొండ సిద్ధార్థ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కు చెందిన సింధు, కదిరి బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన హర్షన్‌, సోమందేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన చరణ్‌ తేజ్‌, ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన కళ్యాణ్‌, ఎన్‌పి కుంట మండలం గూటి బైలు కు చెందిన హేమలత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్‌ ప్రదీప్‌, డాక్టర్‌ నరేష్‌, హెచ్‌ఎం చిన్నకృష్ణారెడ్డి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రమౌళి నాగరాజు తదితరులు పాల్గొన్నారు