Dec 24,2022 22:11

విద్యార్థిని అభినందిస్తున్న పాఠశాల ప్రతినిధులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : బ్లూ మూన్‌ ఇంటర్నేషనల్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని మానస రాష్ట్రస్థాయి రోప్‌ స్కేపింగ్‌ క్రీడలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు కళాశాల చైర్మన్‌ శివశంకర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ వారు నిర్వహించిన క్రీడా పోటీల్లో మానస ప్రతిభను కనపర్చినట్లు చెప్పారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు కూడా ప్రోత్సహిస్తున్నామని ప్రధాన ఉపాధ్యాయుడు మాధవరెడ్డి తెలిపారు. మానస జనవరినెలలో ఒంగోలులో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటుందని వారు తెలిపారు.