ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ ఎన్బీఎఫ్ ఆధ్వర్యంలో జరిగే వివిధ క్రీడల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల హెచ్‌ఎం శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బేస్‌బాల్ అండర్-14 బాలుర విభాగంలో పార్థసారధి కాకినాడలో జరిగే పోటీల్లో, నెట్‌బాల్ అండర్-14 బాలుర విభాగంలో కార్తిక్‌నాయక్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే పోటీల్లో, బాల్ బాడ్మింటన్ అండర్ -17 బాలుర విభాగంలో పవనకుమార్ మదనపల్లిలోజరిగే పోటీలలో, అండర్ -14 విభాగంలో చిరంజీవి, మహేష్, పొద్దుటూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారన్నారు. ఈమేరకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్తులను పీడీలు నవీన్ కుమార్, నాగేంద్ర, ఉపాధ్యాయులు హేమలత, తులసీ, శంకరనారాయణ, శ్రీనివాసులు, ప్రసాద్‌బాబు, రామక్రిష్ణ, వి.శ్రీనివాసులు నాగరాజు, లీలావతి అభినందించారు.
రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులతో అధ్యాపకులు










