ప్రజాశక్తి - రాయచోటి : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా పేర్కొన్నారు. గురువారం ఇదేం కర్మ కార్యక్రమం 27వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసమే జగన్మోహన్‌రెడ్డి వైసిపిని పెట్టారన్నారు. రాష్ట్రంలో ఇసుక ధరలు భారీగా పెంచి భవన కార్మికుల కడుపు కొట్టారన్నారు. అక్రమంగా ఇసుక తరలించుకుని రూ.కోట్లు వైసిపి నాయకులు ఖజానా నింపుకుంటున్నారని తెలిపారు. ఒకపక్క ఉద్యోగ ఉపాధి లేకుండా నిరుద్యోగ యువతకు మోసం చేస్తున్నారున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి నడక నేర్పించింది చంద్రబాబు నాయుడన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు పట్టం కట్టడం ఖాయమని పేర్కొన్నారు. పేద ప్రజల రక్తాన్ని పీల్చుకొని వైసిపి నాయకులు తింటున్నారన్నారు. ప్రతి ఒక్కరి నోటి నుండి వినిపిస్తున్న మాట ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఓటు వేసి ఖర్మ అనుభవిస్తున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సీనియర్ నాయకులు నైఫ్ ఐటిడిపి రాజంపేట పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి అత్తార్, జావేద్, రాజంపేట పార్లమెంటరీ బిసి కార్యదర్శి రామచంద్ర, నియోజకవర్గ తెలుగు యువత నాయకులు మొహమ్మద్, అర్షడ్, ఇర్షడ్ పాల్గొన్నారు.










