మడకశిర : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందనిమాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. మండలం చందకచెర్లలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రంగే గౌడ్, క్లస్టర్ ఇన్‌ఛార్జి నాగరాజు, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ విశ్రాంత ఉద్యోగి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : రానున్న ఎన్నికల్లో వైసిపికి చరమగీతం పాడదామని టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ అన్నారు. ఇదేం కర్మ కార్యక్రమాన్నిమంగళవారం కదిరి పట్టణంలోని 34 వార్డులో నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైసిపి అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు బాబ్జాన్, 34 వార్డు మాజీ కౌన్సిలర్ హుస్సేన్, పార్టీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు
బుక్కపట్నం : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కృష్ణాపురం, గోపాలపురం గ్రామాలలో మంగళవారం నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్‌రెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, నాయకులు మీసాల మురళి , లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు .
ధర్మవరం టౌన్ : దర్శవరంలో నియంతపాలన సాగుతోందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ విమర్శించారు. పట్టణంలోని సిద్దయ్యగుట్ట, సాయినగర్ ప్రాంతాలలో మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో కొన్నిప్రశ్నలతో కూడిన కరపత్రాలను పంపిణీచేశారు. అందులో ఎక్కువ శాతం మంది ప్రజలు వివిధ కారణాలతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ధర్మవరంలో ఎవరైనా ఆస్తి కొనాలంటే భయపడే పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు సాహిబ్బీ , బీబీ, నాయకులు కమతం కాటమయ్య ఫణికుమార్, బోయరవిచంద్ర, పురుషోత్తంగౌడ్. చింతపులుసుపెద్దన్న, రాంపురంశీన, రాళ్లపల్లిపరీష్, అంబటి సనత్ తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు : మండలపరిధిలోని పి.కొత్తపల్లి గ్రామపంచాయతీలోని బాలేపల్లి తండా, పూలకుంటపల్లి, పి కొత్తపల్లి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్నిమంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాబ్జాన్, మండల కన్వీనర్ రాజశేఖర్, మాజీ ఎంపీపీ మాబు సాబ్, సీనియర్ నాయకులు నాగభూషణ నాయుడు, అంజనప్ప, జక్కా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.










