Jul 09,2021 18:05

అమరావతి : గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,040 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 659 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతిచెందారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 4,576 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,17,253కి చేరుకోగా.. మొత్తం 18,73,993 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,960 మంది మృతిచెందారు. ప్రస్తుతం 30,300 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.