ప్రజాశక్తి -పొదలకూరు :రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారని టిడిపి జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో 'బాబుతో నేను' పేరుతో నిర్వహించిన రిలే నిరాహార దీక్షను సోమిరెడ్డి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరసనల మాట వింటేనే ప్రభుత్వం ఉలిక్కి పడుతుదని, శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన కూడా వ్యక్తం చేయనీయకుండా ఎక్కడికక్కడ అణచివేస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సర్వేపల్లి నియోజకవర్గ అబ్జర్వర్ దావా పెంచలరావు, తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు మావిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు ఉన్నారు.










