పుట్టపర్తి అర్బన్ : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఈ పాలనకు స్వప్తి పలకాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎనుములపల్లి సమీపంలో గల శిల్పారామం కాలనీలో శుక్రవారం నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు ఎల్‌ఐసి నర్సింహులు, సామకోటి ఆదినారాయణ, మహమ్మద్ రఫీ, గూడూరు ఓబులేసు, దయ్యాల ఉమాపతి యాదవ్, ఆవుల సుబ్రహ్మణ్యం, మాల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : వైసీపీ ప్రభుత్వం గడిచిన మూడున్నర సంవత్సరాల కాల వ్యవధిలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం ప్రాజెక్టులు భవనాల శంకుస్థాపనలకు, ప్రచారాలకే పెద్దపీట వేసిందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. మండల పరిధిలోని హరే సముద్రం పంచాయతీ పరిధిలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా గుండుమల మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ గుంతల మయంగా మారాయన్నారు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తితోపాటు నాయకులు రఘురాం, లక్ష్మీనారాయణ, మనోహర్, భక్తర్‌తో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.










